కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో కొన్నాళ్లుగా అనాథలుగా కాలం గడుపుతున్న తల్లీబిడ్డలకు సీతయ్య ఫౌండేషన్ వారు ఆశ్రయం కల్పించారు. వారితో పాటు దుర్భర పరిస్థితుల్లో ఉన్న మానసిక దివ్యాంగురాలిని కూడా ఆదుకున్నారు. వీరిని మండపల్లి గ్రామం వద్ద వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వానప్రస్థాశ్రమంలో చేర్పించారు. కవిటి మండలం దూగానపుట్టుగ వద్ద బారపుట్టుగ గ్రామవాసి దేవర హేమ రాజమండ్రిలో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడు పెళ్లి చేసుకున్నాక మోసం చేసి వదిలేశాడు. దీంతో చంటి బిడ్డతో ఆమె రైల్వే స్టేషన్‌లోనే మూడు నెలలుగా ఉంటోంది. దీంతో పాటు మరో మహిళ కంచిలిలో స్థానికుల ఆదరణ మీదే బతుకుతోంది. వీరిని సీతయ్య ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది.


