30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయ త్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మహారాష్ట్ర అహిల్యనగర్‌ జిల్లా, జామ్‌ఖేద్‌ కి చెందిన శంకర్‌ చంద్రకాంత్‌ పవార్‌, నవీముంబై థా నే జిల్లా, భుతవాలీగామ్‌ కి చెందిన సునీత విజయ్‌ కాలే అనే మహిళ ఇద్దరూ కలసి లగేజి బ్యాగ్‌లతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి వస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ఆర్థి క పరిస్థితి బాగులేకపోవడంతో ముంబైలో గంజా యి వ్యాపారం చేసే దీపక్‌ అశోక్‌ పవార్‌ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఒడిశా నుంచి గంజాయి వ్యాపారి సూచించిన వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి తనకి అందజేస్తే తీసుకొచ్చిన ప్రతి సారి రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీనికి నిందితులు ఇద్దరూ అంగీకరించి ఒడిశాలో మార్షల్‌ లిమ్మా అలియాస్‌ రాజే ష్‌ వద్ద నుంచి గంజాయిని తీసుకెళ్లి ఇప్పటికే మూ డు సార్లు గంజాయి వ్యాపారికి అందజేశారు. ఇదే క్రమంలో ఈనెల 12 వ తేదీన గంజాయి కోసం విశాఖపట్టణం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజా యి సరఫరా చేసే వ్యక్తికి ఫోన్‌ చేయగా బరంపురంలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని 20 వ తేదీన ఇచ్ఛాపురంలో ఉంటే అక్కడికి తీసు కొచ్చి సరుకు అందజేస్తానని చెప్పాడు. దీనికి వీరు విశాఖపట్టణంలో ఐదు రోజులు ఉండి అక్కడి నుంచి బ రంపురం చేరుకున్నారు. బరంపురంలో రెండు రోజులు బస చేసి శనివారం ఇచ్ఛాపురం చేరుకున్నా రు. వీరు గంజాయి సరఫరా చేసే వ్యక్తి రాజేష్‌కి ఫో న్‌ చేయగా ఉదయం ఒక లగేజి బ్యాగ్‌, రెండు చేతి బ్యాగ్‌లతో 30.600 కిలోల గంజాయిని ఎల్‌సీగేట్‌ వద్ద అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద రూ లగేజ్‌తో రైల్వేస్టేషన్‌కి వస్తుండగా పట్టణ పోలీసులకు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement