‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’

నరసన్నపేట: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం జరుగుతుందని దీంట్లో పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారు లు, ఆపై అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ‘సర్‌’ కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జి కుంబా రవిబాబు అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని పోలాకి మండలం కుసుమపోలవలస, నరసన్నపే ట మండలం సత్యవరం గ్రామాల్లో సర్‌ కార్యక్ర మం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును ఆయన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలసి శనివారం పరిశీ లించారు. బీఎల్‌ఓను అడిగి సర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. నిబంధనలు పాటించాలని, అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించా రు. పార్టీ బూత్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటర్లకు ఇచ్చే ఎన్యూమరేషన్‌ ఫారాలు ఒకటి ఓటరు వద్దే ఉండాలని, అప్పుడే మనకు బలం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుని కీ ఓటు హక్కు ఉండాలన్నారు. వారి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళి, పార్టీ బూత్‌ కమిటీ జిల్లా అధ్యక్షులు దోమ మన్మధరావు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement