న్యూస్‌రీల్
ఎన్నాళ్లీ ఎదురు చూపులుఆఫ్‌షోర్ నిర్వాసితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆర్‌ఆర్ కాలనీలో వసతులు లేవు. –8లో
హృదయ విదారకం : రైలు పట్టాలపై మృతదేహాలు
అంత పెద్ద రైలు ఎదురుగా వస్తుంటే
ఆ చిన్ని గుండెలు ఎంత భయపడ్డాయో..
కాస్త కింద పడితేనే తట్టుకోలేని ఆ దేహాలు ఛిద్రమైన దశలో
ఎంత యాతన అనుభవించాయో..
బతుకంటే తెలీని పసి వయసులో చావు ఎంత వణికించిందో.
ఊపిరి పోసిన అమ్మ ఉసురు తీస్తుందని వారు ఊహించలేదు. అమ్మ ఆవేశం తమ ఆయువు తీస్తుందని వారు అనుకుని ఉండరు. తాళభద్ర రైల్వే గేటుపై నిశిరాత్రి పూట ఈ రక్తపు మరక పడింది. క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రాణాలు తీసుకోవడంతో పాటు కన్నపేగులను బలిపెట్టింది.
పలాస, టెక్కలి:
పలాస రైల్వే స్టేషన్‌కు సమీపంలోని తాళభద్ర రైల్వే గేటుకు కొద్ది దూరంలో గురువారం రాత్రి కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజ (26), ఆమె కుమారుడు కుశాంత్‌వర్మ(6), కుమార్తె దీక్షిత(4)లు రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఇది పలాసలో సంచలనంగా మారింది. పట్టాలపై విగత జీవు లుగా పడి ఉన్న తల్లీబిడ్డలను చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. అర్ధరాత్రి ఘటన జరిగాక తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పలాస రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు..
చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల వెంకట్, భార్య పూజ, ఇద్దరు పిల్లలు కుశాంత్, దీక్షితతో విజయవాడలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వెంకట్ తల్లి పాపమ్మకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటి వరకు సపర్యలు చేసిన వెంకట్ సో దరి తన కుటుంబ సమస్యల నేపథ్యంలో అత్తవారింటికి వెళ్లిపోయారు. దీంతో అమ్మకు సపర్యలు చేయ డం కోసం వెంకట్ భార్యాపిల్లలను చలమయ్యపేట తీసుకుని వచ్చారు. భార్యా పిల్లలను ఇక్కడే విడిచిపెట్టి తాను ఒక్కడే విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గ్రామ పెద్దలు సైతం పలుమార్లు కలుగజేసుకుని సర్దిచెప్పారు.
ఈ క్రమంలో గురువారం పూజ భావనపాడు లోని తన కన్నవారింటికి పిల్లలను తీసుకుని వెళ్లిపోతానని బయల్దేరారు. ఈ క్రమంలో వెంకట్ భావనపాడు గ్రామంలో ఉన్న తన అత్తకు గురువారం సా యంత్రం 5 గంటలకు ఫోన్ చేసి పిల్లలను తీసుకెళ్లమని సమాచారం ఇచ్చాడని మృతురాలి బావ జోజేశ్వరరావు తెలిపారు. దీంతో పూజ తల్లిదండ్రు లు కంగారు పడి బస్సులో బయల్దేరి చలమయ్య పేట వెళ్లారు. వారు ఇంటికి వెళ్లే సరికి తల్లీపిల్లలు కనిపించలేదు. వెంటనే కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు తాము ఇప్పుడేమీ చేయలేమని, సీసీ పుటేజీలు, ఇతర సమాచారం సేకరించి చెబుతామని వారిని పంపించేశారు. వారు రాత్రంతా తల్లీపిల్లల కోసం గాలించారు. తెల్లారే సరికి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు.
ఈ అఘాయిత్యానికి కారణం ఏమై ఉంటుందని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నా రు. మృతదేహాలు ఉన్న పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతురాలి స్వగ్రామం భావనపాడు నుంచి, ఆమె బావ ఉన్న మాకన్నపల్లి నుంచి పెద్ద ఎత్తున బంధువులు, ఇతరులు వచ్చినప్పటికీ చలమయ్యపేట నుంచి కనీసం ఒక్కరు కూడా చేరుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును పలాస జీఆర్పీ సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026
ఇద్దరు బిడ్డలతో రైలుకిందపడి
తల్లి ఆత్మహత్య
పలాస రైల్వేస్టేషన్ పరిధి తాళభద్ర సమీపంలో ఘటన
అత్తకు సపర్యలు చేసే విషయంలో భర్తతో వివాదం
కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటలో విషాద ఛాయలు


