21 డచ్‌ భవనం వద్ద ప్రపంచ యోగా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

21 డచ్‌ భవనం వద్ద ప్రపంచ యోగా దినోత్సవం

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

21 డచ్‌ భవనం వద్ద ప్రపంచ యోగా దినోత్సవం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డచ్‌ భవనం వద్ద ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శుక్రవారం తెలిపారు. 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

గురుకుల పాఠశాల

ఆకస్మిక తనిఖీ

పాతపట్నం: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షే మ గురుకుల జిల్లా సమన్వయాధికారి(డీసీఓ) వై.యశోద లక్ష్మి అన్నారు. మండలంలోని ప్రహారాజపాలెంలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవా రం తనిఖీ చేశారు. భోజనాలను పరిశీలించా రు. వంటశాల, నిత్యావసర సరుకులు, ఎక్స్‌పైరీ డేట్లను తనిఖీ చేశారు. వంటగదిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్‌ పి. పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పోలీసుల సంక్షేమమే ముఖ్యం

శ్రీకాకుళం క్రైమ్‌ : పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, సంక్షేమమే డయల్‌ యువర్‌ ఎస్పీ పోలీసు గ్రీవెన్స్‌ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫోన్‌లో నేరుగా సిబ్బందితో మాట్లాడి వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

‘భోగాపురం తర్వాత ఆస్పత్రిపై దృష్టి పెడతా’

శ్రీకాకుళం : రిమ్స్‌ను జిల్లాలోనే ఉత్తమ సేవలు అందించే ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బల గలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అక్షర సమావేశ మందిరంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.4 కోట్ల ముప్పై లక్షల సీఎస్సార్‌ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ను జీజీహెచ్‌ అధికారులతో కలిసి శుక్రవారం మార్చుకున్నారు. భోగాపురం పూర్తయ్యాక.. ఆస్పత్రిపై దృష్టి పెడతానని అన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ కేవలం ఆరు రోజుల్లోనే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లాంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ రూ.4.51 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ టేబుల్‌ ల్యాంప్స్‌ కూడా లేవని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

బొడ్డపాడు లేఅవుట్‌ ప్లాట్లకు ఈ–వేలం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పలాస మండలం బొడ్డపాడు ఎన్‌.టి.ఆర్‌. స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు సుడా వైస్‌ చైర్మన్‌, జా యింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ శనివారం తెలిపారు. గతంలో అమలు చేసిన ఈ–లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈసారి ‘భూ కొనుగోలు’ పోర్టల్‌ ద్వారా ఈ–వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫేజ్‌–1లో ఖాళీగా ఉన్న 200 ప్లాట్లు, ఫేజ్‌–2లో అందుబాటులో ఉన్న 361 ప్లాట్లను కొనుగోలుదారుల కోసం సిద్ధం చేశామని చెప్పారు. చదరపు గజం ధర రూ.5,700 గా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి గల వారు జూన్‌ 20 ఉదయం 10 నుంచి జూలై 12 రాత్రి 10గంటల లోపు konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌, పాన్‌కార్డ్‌ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 2,000తో పాటు లక్ష రూపాయల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న వారితో జూలై 15న వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement