ఇలా ఐతే ఎలా..? | - | Sakshi
Sakshi News home page

ఇలా ఐతే ఎలా..?

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

పాతపట్నంలో మూతపడిన నేత్ర పరీక్ష కేంద్రం

రెండేళ్లుగా తెరుచుకోని వైనం

అవస్థలు పడుతున్న రోగులు

పాతపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం రంగం నీరుగారిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో నేత్ర పరీక్ష కేంద్రం రెండేళ్లుగా తెరచుకోవడమే లేదు. వైఎస్సార్‌ హయాంలో ఇక్కడ ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, సావరకోట, ఎల్‌.ఎన్‌ పేట మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేది. నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తితే ఐ కేంద్రానికి వచ్చి పరీక్షలు చేసి అవసమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలను అందజేసే వారు. అలాగే ప్రతి ఆరు నెలలకు నేత్ర వైద్య శిబిరాలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవారు.

పాతపట్నం సామాజిక ఆస్పత్రిలో కంటి వైద్యుడు గతంలో ఉండేవారు. ఇప్పుడు సీహెచ్‌సీలో కంటి వైద్యుడు కూడా లేకపోవడం, కూట మి ప్రభుత్వం నియంచకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేత్ర వైద్య సేవలు 2024 సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి నిలిచిపోయాయి. వృద్ధులు, పేదలు ఆస్పత్రికి వచ్చి నేత్ర పరీక్ష కేంద్రంలో సేవలు అందకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యాధికారులు దృష్టి సారించి నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

నేత్ర వైద్య సేవలు అవసరం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతపట్నం సామాజిక ఆస్పత్రి లో ఐ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందటి వరకు సక్రమంగా సేవలు అందేవి.

– సవిరిగాన ప్రదీప్‌, వైస్‌ ఎంపీపీ, పాతపట్నం

ఉన్నతాధికారులకు తెలియజేశాం

పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలోని నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాల ని జిల్లాఉన్నతాధికారులకు విన్న వించాం. కౌన్సిలింగ్‌లో కంటి వైద్యులను నియమిస్తామన్నారు. – డాక్టర్‌ దాము లీలాకుమార్‌,

సీహెచ్‌సీ సూపరిండెంటెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement