● కూటమి సభలో అర్ధంతరంగా
వెనుదిరిగిన కూటమి కార్యకర్తలు
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో శుక్రవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు హాజరైన వారంతా ఉక్కపోతతో విలవిల్లాడిపోయారు. వేదికపై కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ సభా ప్రాంగణంలో ఉన్నవారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వేడి, ఉక్కపోతను తట్టుకోలేక కార్యకర్తలు సభ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో కొందరు వడదెబ్బ బారినపడి ఇంటి ముఖం పట్టారు. మరోవైపు జిల్లా స్థాయి విజయోత్సవ సభకు సంబంధించిన బ్యానర్లపై ఎన్టీఆర్ ఫొటో కనిపించకపోవడంతో ఆయన అభిమానులు, తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


