సోంపేట: సోంపేట – బారువ రైల్వేస్టేషన్ల పరిధిలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నలుపు ఫుల్‌హ్యాండ్ షర్ట్, నీలం జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు రైల్వే కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు (9492250069)ను సంప్రదించాలని కోరారు.
గుండెపోటుతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం టౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్(56) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన ప్రసాద్ పీఎన్‌కాలనీ సంపత్‌బాలాజీనగర్‌లో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు సంతోష్ లా చదువుతున్నారు. కొన్నేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా గత జూన్‌లో ఇచ్ఛాపురం చేరారు. తనకు అనారోగ్యమని, డయాలసిస్‌కు ఇబ్బంది అవుతుందని, కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయమని ఎస్పీని పలుమార్లు వేడుకున్నట్లు పోలీసువర్గాల సమాచారం.
పిడుగుపాటుకు ఆవు మృతి
కవిటి: జగతి గ్రామంలో పూడి వంశీమోహన్‌కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం తోటలో ఆవు మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పశుసంవర్థఖ శాఖాధికారులు ఆవును పరిశీలించి పిడుగు పాటు కారణంగా మృతి చెందినట్లు నిర్థారించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
ప్రసాద్(ఫైల్)


