ఉక్కపోతకు గురైన వృద్ధురాలు
గార: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. శుక్రవారం ప్రముఖ విష్ణు క్షేత్రం శ్రీకూర్మనాథాలయ ప్రాంగణలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వారి ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుత రోజుల్లో జీవితంలో ప్రతి ఒక్కరికీ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద భారీ యోగా కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్‌రాజ్ రాణా, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఎస్.శ్రీనివాసులు, దేవదాయ శాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


