శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

తప్పుడు పత్రాలతో రుణాలు తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు పొందారు. ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. –8లో మహిళ అనుమానాస్పద మృతి గొల్లూరులో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. –8లో శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

తప్పుడు పత్రాలతో రుణాలు తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు పొందారు. ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. –8లో
మహిళ అనుమానాస్పద మృతి గొల్లూరులో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. –8లో

హిరమండలం:

మండల వాసులను తాగునీటి సమస్య వదలడం లేదు. రోజు రోజుకూ సమస్య జఠిలమవుతూనే ఉంది. దీంతో స్థానిక మహిళలు ఎప్పటికప్పు డు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం మళ్లీ వారు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున అలికాం–బత్తిలి రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోజు కాదు, వారం కాదు, నెలలు కాదు సంవత్సరాల తరబడి అదే సమస్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నిరసనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

అడిగితే కేసులు..

మహిళలు రోడ్డెక్కడంతో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ వారికి సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి బైఠాయించారు. అయితే దీన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేయించి మీసాల వెంకట రామకృష్ణ ను అరెస్టు చేయించారు. పోలీస్‌ యాక్టు 30 ఉన్నందున ఆందోళన కొనసాగిస్తే కఠినమైన కేసులు న మోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో మహిళలు ఆందోళన విరమించక తప్పలేదు. అయి తే మీసాల వెంకటరామకృష్ణతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హిరమండలం చేరుకున్నారు. స్థానికుల తాగునీటి సమస్యను అడి గి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మీసాల వెంకటరామకృష్ణతో పాటు ఆ నలుగురిని పరామర్శించారు. నీరు అడిగితే కేసులు నమోదు చేసే చేతకాని పాలకులను ఏమనాలని ప్రశ్నించారు. భేషరతుగా కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

దాదాపు నెల రోజుల కిందట కూడా స్థానిక మహిళలు నీటి కోసం ఆందోళన చేశారు. అప్పట్లో పోలీసులు సముదాయించారు. కానీ సమస్య పరిష్కా రం కాక మరోమారు రోడ్డెక్కే సరికి వెర్రెక్కిపోయా రు. అధికారులు కనీసం ఇటువైపు రాలేదు. సమస్య పరిష్కరిస్తామని చెప్పలేదు. ఏకంగా పోలీస్‌ యాక్టు ఉందని చెప్పి స్థానికుల నోరు మూయించే ప్రయ త్నం చేశారు. వంశధార గట్టునే ఉన్నా ఈ యాతన ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement