● కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులు
రణస్థలం: లావేరు మండలంలోని చాలా పంచాయతీల్లో చెరువులు రూపురేఖలు కోల్పోయాయి. గో విందపురం పంచాయతీలో గల ఇజ్జాడపాలెం గ్రా మంలో తుమ్మలవాని చెరువు కబ్జా కోరల్లో చిక్కు కుంది. సర్వే నెంబర్ 117గల తుమ్మలవాని చెరువు విస్తీర్ణం 12 ఎకరాలు ఉండగా అందులో ఐదు ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది. కొంతమంది వ్య క్తులు చెరువును చదును చేసి పంటలు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అలాగే అదే మండలంలోని అదపాక రెవెన్యూ పరిధిలోని నిడగంట్లవాని చెరువూ అదే కోవలోకి వస్తుంది. చెరువు విస్తీర్ణం 72 ఎకరాలు ఉండగా అందులో 30 ఎకరాల ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. చెరువులో ఉన్న మొక్క లు తొలగించి వ్యవసాయానికి అనుకూలంగా మార్చేశారు. ఇలా జరిగితే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో భారీ స్థాయిలో చెరువులు ఆక్రమణలకు గురవుతు న్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం వెనుక తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉండే వీఆర్వోలు, వీఆర్‌ఏలు చెరువులు పరిరక్షించాలని కోరుతున్నారు.


