శ్రీకాకుళం అర్బన్: రక్తదానం ప్రాణదానమని ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ విజనరీ లీడర్ తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా యూనియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ, ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రెటరీ ఎల్.చంద్రశేఖర్, ప్రెసిడెంట్ ఆర్.నరేంద్ర కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ విశాఖపట్నం, ఎస్‌బీఐ మాడ్యూల్ సుష్మ, వైస్ ప్రెసిడెంట్ సతీష్ పిలుపు మేరకు గురువారం బ్యాంకు రీజనల్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టాఫ్ యూనియన్ శ్రీకాకుళం రీజనల్ సెక్రెటరీ కేసీహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ద్వారా సుమారు 150 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఉదయ్‌కుమార్ సింగ్, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


