ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు వీఆర్‌ఓల మద్దతు | - | Sakshi
Sakshi News home page

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు వీఆర్‌ఓల మద్దతు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు వీఆర్‌ఓల మద్దతు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఏపీజేఏసీ అమరావతి తీసుకున్న నిర్ణయాలు, ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా వీఆర్వోల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళంలోని రెవెన్యూ వసతి గృహంలో జిల్లా వీఆర్‌వోల సంఘం నాయకులు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలకు, శ్రీకాకుళం జిల్లా వీఆర్వో సంఘం, పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సమావేశంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బి.వి.వి.ఎన్‌.రాజు, వీఆర్వో ల సంఘం జిల్లా కార్యదర్శి బి.రామ్‌జీ, ట్రెజరర్‌ జి.ఢిల్లేశ్వరరావు, ఏపీ గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.గోవిందరావు, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement