యోగా పోస్టర్‌ పోటీల విజేతలకు బహుమతులు | - | Sakshi
Sakshi News home page

యోగా పోస్టర్‌ పోటీల విజేతలకు బహుమతులు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

యోగా పోస్టర్‌ పోటీల విజేతలకు బహుమతులు

గార: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన యోగా పోస్టర్‌ రూపకల్పనలో గెలుపొందిన విద్యార్థులకు వమరవల్లి డైట్‌ ప్రిన్సిపాల్‌ ఏ.గౌరీశంకరరావు బహమతులు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీకాకుళం ఏపీఎంజేపీ స్కూల్‌ టి.గాయత్రి ప్రథమస్థానం, వప్పంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.ఉష ద్వితీయ, టెక్కలి ఏపీఎంజేపీ పాఠశాల విద్యార్థిని పి.జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతులు అందజేసారు. పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు పరిశీలించారు. కార్యక్రమంలో యోగా జిల్లా కో ఆర్డినేటర్‌ ఎస్‌.ప్రసాద్‌, పి.కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement