చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి | - | Sakshi
Sakshi News home page

చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి

శ్రీకాకుళం: ఆర్‌టీఈ చట్ట సవరణ ద్వారా 2010 టెట్‌ నోటిఫికేషన్‌కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి ఉత్తీర్ణత నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఏపీయూఎస్‌) అధ్యక్షుడు దుప్పల శివరామ్‌ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు గురు వారం కలెక్టరెట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎచ్చెర్ల మురళి, ఎస్‌.రాజు, ఉపాధ్యక్షుడు కల్లి శ్రీనివాసరావు, మద్దెల నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement