నా డు
● పాఠశాలలు తెరుచుకున్నా జాడలేని స్కూల్ బ్యాగులు
● చిరిగిన సంచులతో బడిబాట
పడుతున్న విద్యార్థులు
● గత ప్రభుత్వ హయాంలో తొలి రోజే పంపిణీ
● మండిపడుతున్న తల్లిదండ్రులు
కొత్త
క్లాసులు..
ఇచ్ఛాపురం రూరల్ :
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఇంకా బ్యాగులు అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని ఉచితంగా అందించాల్సినా ఇంతవరకు ఆ ఊసే లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు పాత, చిరిగిన బ్యాగులతోనే బడులకు వెళ్తున్నారు. కొందరు విద్యార్థులు పుస్తకాలను చేతుల్లో పట్టుకుని, మరికొందరు పాత సంచుల్లో పెట్టుకొని, మరికొందరు మార్కెట్‌లో కొనుగోలు చేసిన బ్యాగుల్లో ఉంచి పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలు జిల్లాలోని అనేక పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. అసలు బ్యాగులు ఎప్పుడు వస్తాయో, పంపిణీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బడులు మొదలైనా..
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పిల్ల లుపుస్తకాలు, నోట్‌బుక్స్ తీసుకెళ్లేందుకు ఇబ్బందు లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గత ఏడా ది ఉపయోగించిన బ్యాగులను వినియోగిస్తున్నా రు. చాలా వరకు బ్యాగులు చిరిగిపోవడం, జిప్‌లు పనిచేయకపోవడం, పట్టీలు తెగిపోవడం వంటి సమస్యలతో ఉన్నా.. వాటినే వాడాల్సిన పరిస్థితి.
పేదలపై ఆర్థిక భారం
బ్యాగులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు ఆర్థిక భారమైనప్పటికీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యా అవసరాల కోసం ఖర్చులు పెరిగిన తరుణంలో బ్యాగుల కొనుగోలు మరో భారంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
గతంలో తొలి రోజే పంపిణీ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశా
తప్పని ఎదురుచూపులు..
జిల్లాలో 2,611 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,600కు పైగా విద్యార్థులు కొత్త బ్యాగుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బ్యాగులను జిల్లాకు తరలించి పంపిణీ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఆరా తీసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారిలను ఫోన్‌లో సంప్రదించినా స్పందించకపోవడం గమనార్హం.
లలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగులు, యూనిఫామ్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, టైలు వంటి విద్యా సామగ్రి పంపిణీ జరిగేదని పలువురు తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. పాఠశాలకు వచ్చిన మొదటి రోజే అవసరమైన వస్తువులు అందడంతో చదువుపై దృష్టి పెట్టేవారని చెబుతున్నారు.


