వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డిలు ఏనాడూ రైతాంగానికి అన్యాయం చేసిన సందర్భాలు లేవు. చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి రోడ్డెక్కించి ధర్నాలు, రాస్తారోకోలు చేయించేలా పాలిస్తున్నారు. రేషన్ కార్డుల తరహాలో రైతులకు కార్డులిచ్చి తాము నిర్దేశించిన మేరకే ఎరువులు, విత్తనాలు ఇస్తామనడం దారుణం.
– గొర్లె కిరణ్‌కుమార్,
ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే
కూటమి వైఫల్యమే..
ఎవరు ఎన్ని చెప్పినా రైతులను అక్కున చేర్చుకుని ఆదుకున్నది మాత్రం వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డిలే. వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు బస్తాకు రూ.8 కమీషన్ దండుకోవడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు విభాగాలతో సమావేశాలు ఏర్పాటుచేసి రైతులకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు వివరించి అండగా ఉంటాం. రైతుల ఆత్మహత్యలు కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యమే కారణం.
– జెన్నూరి రామారావు, వైఎస్సార్‌సీపీ
రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు


