● ఉచితం మాటున ఇసుక దందా
● కేశుపురం
పంచాయతీలో ఐ–టీడీపీ నేత దౌర్జన్యం
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ముసుగులో ప్రజలకు అందాల్సిన ఇసుకను కొందరు అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక బాహుదానది పరివాహక ప్రాంతంలో అధికార పార్టీ నేతల అనుచరులు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం కేశుపురం పంచాయతీ నీలాపుపుట్టుగ గ్రామానికి చెందిన ఐ–టీడీపీ నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్లతో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగించాడు. విషయం తెలుసుకున్న విలేకరులు ఫొటోలు తీయడంతో ‘అధికారంలో ఉన్నాం.. ఇది మా ప్రభుత్వం.. మమ్మల్ని ఆపేది ఎవరు..?’ అంటూ బెదిరించడంతో విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై తహసీల్దార్ స్పందిస్తూ బాహుదానదిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. –ఇచ్ఛాపురం రూరల్


