చేత కాదా..?
మిథ్యాహ్న భోజనమేనా..?
టీసీ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్
ఇంధనం ఆదా చేయాలన్నారు.. పొదుపు మంత్రం పాటించాలని సూచనలు ఇచ్చారు.. జనాలకు మనమే ఆదర్శంగా ఉండాలని పిలుపు కూడా ఇచ్చారు.. కానీ కలెక్టర్ సూచనను అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా.. ఇంధనాలు ఆదా చేయాలని సాక్షాత్తు ప్రధాని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతి వారం గ్రీవెన్స్ సమయంలో అధికారులు సైకిల్‌ను వినియోగించాలని, వాహనాలు వీలైనంతగా వాడకుండా ఉంటే మేలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. కానీ ఈ వారం ఆయన మాత్రమే సైకిల్‌పై గ్రీవెన్స్ కు వచ్చారు. మిగతా అధికారులంతా ప్రభుత్వ వాహనాలనే వినియోగించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
ఇచ్ఛాపురం రూరల్: బడి గంటలు మోగాయి. వేసవి తర్వాత గేట్లు తెరుచుకున్నాయి. పిల్లలు స్కూలు బాట పట్టారు. కానీ విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనం విషయంలో పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ అవసరమైన బియ్యం, చెక్కీలు సమయానికి అందకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, వంట సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పక్క పాఠశాలల నుంచి బియ్యం అప్పుగా తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిపోయిన బియ్యం నిల్వలతోనే భోజనాలు సిద్ధం చేస్తున్నారు.
చేరని బియ్యం..
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు అవసరమైన బియ్యం నిల్వలు చేరాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలలో సరఫరా జరగలేదు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో రెండు, మూడు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉండగా మరికొన్ని చోట్ల పూర్తిగా కొరత ఏర్పడింది.
చెక్కీలు లేవు
విద్యార్థులకు పోషకాహారం అందించే పోషక విలువలు గల చెక్కీలు కూడా పాఠశాలలకు ఇంత వరకు అందలేదు. కూరగాయలు, నూనె, గ్యాస్, మసాలా దినుసులు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు లేక వంట సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో కొన్ని చోట్ల స్థానికంగా అప్పులు చేసి వంటలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది.
మాట్లాడుతున్న సీఐ చిన్నంనాయుడు,
ఎస్‌ఐ ముకుందరావు
రాగి మాల్ట్‌కు బ్రేక్
ప్రైవేట్ కళాశాల నిర్వాకంపై ఎస్‌ఎఫ్‌ఐ
ఆందోళన
శ్రీకాకుళం: నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న మద్ది మణికంఠ అనే విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యం రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. వీరంతా సోమవారం కలెక్టర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. మణికంఠ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో ప్రభుత్వ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నాడని, దీంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యాన్ని టీసీ కోసం సంప్రదించగా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో సమస్యను పరిష్కరించాలని ఆర్‌ఐఓను కలెక్టర్ ఆదేశించారు. తక్షణమే స్పందించిన ఆర్‌ఐవో సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడా రు. తొలుత తటపటాయించిన యాజమాన్య ప్రతినిధి అనంతరం టీసీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది.
కాగా టీసీలు ఇచ్చేందుకు పలు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయని, తక్షణం వారిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అదనపు ఆహారంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 మార్చి నెలలో పాఠశాలల్లో రాగుల పిండి, బెల్లంపొడి తో తయారు చేసిన రాగి జావను ప్రారంభించింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విద్యార్థికి 150 మిల్లీలీటర్ల చొప్పున స్టెయిన్‌లెస్ స్టీలు గ్లాసుల ద్వారా అందించేది. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అదే మెనూను అమలు పరుస్తూ వస్తోంది. గత విద్యాసంవత్సరం ఏప్రిల్ నెలలో విద్యార్థులకు పూర్తిగా రాగి మాల్ట్ పానీయం సరఫరా చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలోనూ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ పాఠశాలలు స్రారంభమైన తర్వాత కూడా మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం, చెక్కీలు, రాగిమాల్ట్ వంటివి అందుబాటులో లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్థుల భోజనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణమే సరఫరా చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
బడులు తెరుచుకున్నా చేరని బియ్యం, చెక్కీలు
మధ్యాహ్న భోజన నిర్వాహణకు తంటాలు
బియ్యం అప్పు తెచ్చుకుంటున్న హెచ్‌ఎంలు
నిలిచి పోయిన రాగిమాల్ట్


