గార: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్టర్ తయారీ పోటీలను నిర్వహిస్తున్నామని వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎ. గౌరీ శంకరరావు తెలిపారు. ఆరోగ్యానికి యోగా– పాఠశాలలో యోగా అనే అంశంపై పాఠశాల స్థాయిలో జూన్ 17 వరకు పోటీలు నిర్వహించాలన్నారు. వీటిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జూన్ 18న నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు పంపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న పోస్టర్ల ప్రదర్శనతో పాటు మెరిట్ సర్టి ఫికెట్లు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.1000, రూ.750, రూ.500లు అందజేస్తామన్నారు.


