‘ఉపాధిని యథావిధిగా అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధిని యథావిధిగా అమలు చేయాలి’

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

‘ఉపాధిని యథావిధిగా అమలు చేయాలి’

పలాస: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని ప్రగతి శీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక భవనం వద్ద శనివారం ఆ సంఘం రాష్ట్ర 9వ మహాసభల కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు 33శాతం మహిళలకు రిజర్వేషన్‌ను అమలు చేయాలని కోరారు. మహిళలను పిల్లలను యంత్రాలుగా చూడటం మానుకోవాలని కోరారు. మహిళలు పోరాటాల వల్లనే రిజర్వేషన్‌ బిల్లు అమలకు నోచుకుంటుందన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీలకు ఉపా ధి, ఆదాయం, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వంకల ఢిల్లేశ్వరి, లలిత, వరాలమ్మ, కళావతి పాణిగ్రాహి, హేమావతి, పార్వతి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మహిళలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement