సాఫ్ట్‌బాల్‌ క్రీడకు విశేష ఆదరణ | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ క్రీడకు విశేష ఆదరణ

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో సాఫ్ట్‌బాల్‌ క్రీడకు గణనీయమైన ఆదరణ లభిస్తోందని సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు సూర శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హోటల్లో శనివారం ప్రపంచ సాఫ్ట్‌బాల్‌ దినోత్సవం పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాఫ్ట్‌బాల్‌ క్రీడను జిల్లాలో మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలని, గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. సీనియర్‌ న్యాయవాది, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం శుభపరిణామమని ఆకాంక్షించారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలంలో జిల్లాలో సాఫ్ట్‌బాల్‌ క్రీడ పురోగతిని వివరించారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు, కోశాధికారి ఎం.ఆనంద్‌ కిరణ్‌, సభ్యులు బి.శ్రీనివాస్‌, జి.రాజశేఖర్‌, డాక్టర్‌ పి.రమేష్‌, ఏ.రాజగోపాల్‌, సతీష్‌రాయుడు, బాబూరావు, హరికృష్ణ, క్రీడాకారులు, శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement