పాఠశాలలు పునఃప్రారంభం నాడే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం యూనిఫాం, బూట్లు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు పాత యూనిఫామ్‌తోనే బడికి వస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా యూనిఫామ్, బూట్లు అందిస్తే విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉంటుంది.
– తమ్మినాన చందనరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్కూల్ టీచర్స్ అసోషియేషన్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పథకాన్ని కాపీ కొట్టిన టీడీపీ ప్రభుత్వం కిట్లు పంపిణీ విషయంలో మాత్రం పాఠశాలలు పునః ప్రారంభం నాటికి అందించలేకపోతోంది. ఆ కిట్లు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వెంటనే కిట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది.
– పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్, శ్రీకాకుళం


