ఉద్యమ ధ్రువతార మార్పు బాలకృష్ణమ్మ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ ధ్రువతార మార్పు బాలకృష్ణమ్మ

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

వజ్రపుకొత్తూరు రూరల్‌: ఉపాధ్యాయ హక్కుల కోసం ఎనలేని పోరాటం చేసి ఉపాధ్యాయ ఉద్యమ ధ్రువతారగా కామ్రేడ్‌ మార్పు బాలకృష్ణమ్మ నిలిచారని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి భుజంగరావు అన్నారు. వజ్రపుకొత్తూరులో శనివారం బాలకృష్ణమ్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. విద్యారంగానికి బాలకృష్ణమ్మ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో పుట్టి ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన విద్యారంగ పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు. బాలకృష్ణమ్మ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు కలిశెట్టి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గున్న సుభాష్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఉదయ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు భీమారావు, కృష్ణారావు, రవి, జగదీష్‌, అప్పారావు, హరికృష్ట, అనిల్‌, నర్సింహమూర్తి, రమణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement