తొమ్మిదో రోజూ కొనసాగిన విచారణ | - | Sakshi
Sakshi News home page

తొమ్మిదో రోజూ కొనసాగిన విచారణ

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

టెక్కలి : కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల విచారణ శుక్రవారం 9వ రోజు కూడా కొనసాగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు కర్నిక జీవన్‌, బోనెల ఎల్లయ్య తదితరులను పోలీసులు విచారించారు.

హైకోర్టు ఆదేశాలతో

పింఛన్లు అందజేత

సంతబొమ్మాళి: ఉమిలాడ పంచాయతీలో కూటమి నాయకుల కుట్రతో నిలిపివేసిన వితంతు పింఛన్లను హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం అందజేశారు. వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నారని ఉమిలాడ పంచాయతీకి చెందిన మెట్ట ఆదిలక్ష్మి, లండ వెంకటమ్మ వితంతు పింఛన్లను గత ఏడాది జూలైలో నిలిపివేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. అయినా న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఇద్దరు వితంతువులకు పింఛన్లను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కెళ్లి జగన్నాయకులు (గోవింద) చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేరుగు రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేరుగు అప్పారావు, హనుమంతు అప్పలనాయుడు, ముగి చిరంజీవి, మేరుగు కాంతారావు, మైలపల్లి ఓంకార్‌, కారి గణపతిరావు, సీకిటి సత్యం, ఏరిపల్లి లక్ష్మణరావు, మేరుగు సత్యం పాల్గొన్నారు.

‘ప్రశ్నించే అక్షరం’ పుస్తకావిష్కరణ

శ్రీకాకుళం: సాంస్కృతిక విలువలు కలిగిన విద్యారంగాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోంలో పీఎస్‌ నాగరాజు రచించిన ‘ప్రశ్నించే అక్షరం’ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే అక్షరం వ్యాస సంకలనం ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చదవాలన్నారు. ఇప్పుడున్న పతన విలువల విద్యారంగాన్ని అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమ లరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి, పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌, ఉపాధ్యాయ సంపాదకులు ఎస్‌.వి.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement