ఇదే ఆనందమంట..! | - | Sakshi
Sakshi News home page

ఇదే ఆనందమంట..!

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

ఇదే ఆనందమంట..! ● మైదానాల బాట పడుతున్న విద్యార్థులు ● మరికొద్ది రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు ● ఎండల్లో జాగ్రత్తలు తప్పనిసరని చెబుతున్న నిష్ణాతులు

ఎండలతో జాగ్రత్తలు తప్పనిసరి..

మన్నికై న దుస్తులు అవసరం

● మైదానాల బాట పడుతున్న విద్యార్థులు ● మరికొద్ది రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు ● ఎండల్లో జాగ్రత్తలు తప్పనిసరని చెబుతున్న నిష్ణాతులు

శ్రీకాకుళం న్యూకాలనీ:

విద్యా సంవత్సరం ముగిసింది. పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులంతా మైదానాల బాట పడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ కూడా నడుస్తుండడంతో క్రికెట్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు కళింగపట్నం, సింగుపురం, ఇచ్ఛాపురం, సోంపేట, మకరాంపురం, పలాస, వజ్రపుకొ త్తూరు, నందిగాం, టెక్కలి, నరసన్నపేట ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం తదితర ప్రాంతాల్లోని క్రీడాకారులు, విద్యార్థులు, యువత, చిన్నారులు మైదానాల్లో సందడి చేస్తున్నారు. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు రెడీ అయిపోతున్నారు. దీనికితోడు త్వరలో మొదలయ్యే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొంతమంది త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంలో తలమునకలవుతున్నారు.

టోర్నీలు, లీగ్‌ మ్యాచ్‌లతో హడావుడి..

వేసవి సెలవుల్లో భాగంగా యువత, విద్యార్థులు పలు క్రీడాంశాల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి, అంతర్‌రాష్ట్ర క్రీడా టోర్నీలు, లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారు. కొన్ని చోట్ల టోర్నమెంట్లను కూడా మొదలుపెట్టేశా రు. ముఖ్యంగా క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో టోర్నీలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి తోపాటు ఫుట్‌బాల్‌, చెస్‌, క్యారమ్స్‌, కరాటే, తైక్వాండో, జూడో క్రీడాంశాల్లోను పోటీలకు కసరత్తులు చేసుకుంటున్నారు.

స్పోర్ట్స్‌ షాపులు కళకళ..

సమ్మర్‌ క్రీడల నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్‌ షాపులు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయి. క్రీడా దుస్తుల విక్రయాలతోపాటు క్రికెట్‌ కిట్లు, వాలీబాల్‌, షటిల్‌ రాకెట్స్‌ మొదలుకుని క్రీడా సామాగ్రి విక్రయాలతో షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. వీటితోపాటు ఫిట్‌నెస్‌ మెరుగుకోసం వివిధ యాంత్రిక పరికరాలు, బండిల్స్‌ విక్రయాలు కూడా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

మండే ఎండల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఉష్ణాగ్రతల నేపథ్యంలో ఉదయం గరిష్టంగా 10.30 వరకు, సాయంత్రం 3.30 గంటల తర్వాత మాత్రమే మైదానాల్లో ఆడుకోవడం ఉత్తమం. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గ్లూకోజ్‌, నిమ్మరసం, ఆరెంజ్‌ వంటి ద్రా వణాలను అధిక మోతాదులో తీసుకోవాలి. కొ బ్బరిబొండాలు,మజ్జిగ తీసుకోవడం మంచిది.

– డాక్టర్‌ బొడ్డేపల్లి సురేష్‌కుమార్‌, వైద్యులు, సన్‌రైజ్‌ హాస్పటల్‌ ఎండీ శ్రీకాకుళం

క్రీడాదుస్తులు, క్రీడా సామ గ్రి కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ సామగ్రి కూడా వచ్చేస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు చూసి కొనుక్కోవాలి.

– మొజ్జాడ వెంకట రమణ, సీనియర్‌ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement