న్యూస్‌రీల్
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వంశధార చెంత నీటి కోసం చింత
హిరమండలం మేజర్ పంచాయతీలో గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వంశధార నది చెంతనే ఉన్నా మేజర్ పంచాయతీ వాసులకు నీటి సమస్య కొనసాగుతూనే ఉంది. ఏటా వేసవి సమయంలో రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ సమస్య తలెత్తడంతో అధికారులు చేతులెత్తేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని
సరఫరా చేస్తున్నారు. మేజర్ పంచాయతీ ప్రజల అవసరాలకు ఇది ఏ మాత్రం చాలడం లేదు.
– హిరమండలం


