వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల సభ్యుల డిజిటలైజేషన్ జిల్లాలో బాగా జరిగింది. అయితే డిజిటలైజేషన్ చేసిన పేర్లు, ఐడీ కార్డుల వెరిఫికేషన్ పూర్తయితేనే వారికి పార్టీ నుంచి గుర్తింపు కార్డులు వస్తాయని, ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సరాసరిన 23 శాతం మేరకే వెరిఫికేషన్ ఇప్పటి వర కూ అయ్యిందని, ఈ నెలాఖరుకల్లా నూరు శాతం పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వెరిఫికేషన్ అయితేనే పార్టీ నుంచి గుర్తింపు కార్డు వస్తుందని తెలిపారు. ఈ గుర్తింపు కార్డు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలోనికి కూడా అనుమతి ఉంటుందని, పార్టీలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. దీని కోసం ప్రత్యేక యాప్ ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలకు పంపించామని, దీన్ని గ్రామా ల్లో ఉన్న ప్రధాన కార్యకర్తలకు ఇచ్చి దీని ద్వారా డిజిటలైజేషన్‌లో రిజిస్టర్ చేసిన పేర్లు ఐడీ కార్డులు అన్నింటినీ పరిశీలించాలన్నారు. శుక్రవారం నాటికి టెక్కలిలో 25 శాతం, శ్రీకాకుళంలో 30 శాతం, నరసన్నపేటలో 20 శాతం, ఆమదాలవలస నియోజ కవర్గంలో 18 శాతం, ఎచ్చెర్లలో 21 శాతం, ఇ చ్ఛాపురంలో 24 శాతం, పలాసలో 15 శాతం, పాతపట్నంలో 18 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, ఈ మేరకు సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం నరసన్నపేట నియోజకవర్గంలో వెరిఫికేషన్ పై సమీక్ష చేశారు. నియోజకవర్గంలో 10907 వరకూ కార్యకర్తలను అనుబంధ సంఘాల్లో సభ్యు లుగా చేర్చగా శుక్రవారం సరికి 20 శాతం మంది ఐడీ కార్డుల వెరిఫికేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.


