ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

పాతపట్నం: పాతపట్నం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి 51వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఆలయం ముందు ఉన్న మామిడి తోటలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ అక్కందర సన్యాసిరావు తెలిపారు. శుక్రవారం కబడ్డీ మైదా నాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 25 సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కానున్నాయని, కబడ్డీ పోటీల్లో పాల్గొనేవారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని, ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్‌ లైట్స్‌ వెలుతురులో జరుగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement