శ్రీకాకుళం పాత బస్టాండ్: భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ జిల్లాలో పర్యటించనున్నారని, దీనికి పటిష్టమైన ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారు లను ఆదేశించారు. జిల్లాలో భారత ఉప రాష్ట్రపతి ిసీపీ రాధాకృష్ణన్ ఈ నెల 27వ తేదీన పర్యటించనున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప రాష్ట్రపతి ప్రోటోకాల్ ఆఫీసర్ అనంతశర్మలతో కలసి జిల్లా అధికారులతో సమీక్షించారు. రెండు హెలీపాడ్లు సిద్ధం చేయాలని ఆర్ అండ్‌బీ ఎస్‌ఈని ఎస్పీ ఆదేశించారు. శ్రీకాకుళం నగ రం శానిటేషన్, బ్యూటిఫికేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చూడాలన్నారు. విద్యుత్ అంతరా యం లేకుండా చూడాలన్నారు. గార వెళ్లే రహదారు లు అన్నీ శుభ్రంగా ఉండాలని జెడ్పీ సీఈఓ, డీపీఓలను ఆదేశించారు.


