వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను విచారించిన పోలీసులు టెక్కలి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం బర్ల కార్తీక్, కోరాడ కామేష్ తదితరులను టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. ఇటీవ ల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో వారిని విచారించారు. వైఎస్సార్‌సీ పీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో ఆరంభమైన విచారణ ప్రక్రియలో విడతల వారీగా కార్యకర్తలను సైతం విచారణ చేస్తున్నారు. పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూ రు హైవేపై శుక్రవారం ఉదయం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న బొలే రో లగేజీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఏఎస్‌ఐ రాజారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం బస్తాలు దగ్ధం ర్యాంకుల వీరుడు ఈ బుడతడు ఆమదాలవలస: మండలంలోని పీరుసాహెబ్ పేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బొడ్డేపల్లి శేఖర్, స్వర్ణలతల కుమారు డు యోజిత్ పరీక్ష ఏదైనా ర్యాంకులతో సత్తాచాటుతున్నాడు. పాత నిమ్మతొర్లువాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న యోజిత్ ఇటీవల జరిగిన ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో 100 మార్కులకు గాను 99 మార్కులతో సేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అలాగే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో 16వ ర్యాంకు, ఏపీ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలో కూడా 244 మార్కులు సాధించాడు. దీంతో యోజిత్‌ను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.
విజయదుర్గకు పూజలు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రా మానికి చెందిన మచ్చ సతీష్, మచ్చ శ్రీనివాసరావులకు సంబంధించిన 30 బస్తాల ధాన్యం, మూగజీవులకు నిల్వ చేసిన వరి గడ్డి అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి వివాదం కారణంగా ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమపై కక్షగట్టి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని నానుబాల వీధిలో వేంచేసిన విజయదుర్గ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.