న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● సెలవులోచ్..
కలాలతో చేతి వేళ్లకు కుదిరిన స్నేహాలకు కొన్నాళ్లు విరామం. బ్యాగుల భారం నుంచి భుజాలకు కాసిన్ని రోజులు విశ్రాంతి. బ్లాక్ బోర్డులతో చాక్‌పీసులకు కొద్ది రోజుల ఎడబాటు. నిద్రావస్థలోకి పుస్తకాలు, నిశ్శబ్దావస్థలోకి స్కూలు ఆవరణలు, మౌనవ్రతంలోకి బడి గంటలు.. కలగలిపి బడులకు వేసవి సెలవులు. విద్యా సంవత్సరం ఆఖరి రోజు కావడంతో పిల్లలు గురువారం వెలుగుతున్న ముఖాలతో బడి నుంచి బయటకు వచ్చారు. హాస్టళ్ల పిల్లలు ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు.


