ఆ ఇంటిని పోషించిన వ్యక్తి చాన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఆ ఇల్లాలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని మానసిక దుస్థితిలో ఉన్నారు. ముగ్గురు ఆడబిడ్డలు అమ్మానాన్నల దీనస్థితి చూసి కన్నీరు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. ఈ ఆపత్కాలంలో వారికి వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. కవిటి మండలం ఆర్.తొత్తిడిపుట్టుగ గ్రామానికి చెందిన భరత్ ఇంటి పరిస్థితిని స్థానికులు పార్టీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబం పరిస్థితి చూసి చలించిపోయిన ప్రకాష్ ప్రతి నెలా రూ.2000వేలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు. అన్న మాట ప్రకారం తొలి నెల ఆ డబ్బుతో పాటు మరో రూ.5వేలు, రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులను ఆ కుటుంబానికి అందజేశారు. ఇది కేవలం సాయం కాదు.. ఆ కుటుంబానికి తోడుగా ఒకరు ఉన్నారనే భరోసాను అందజేసింది. – కవిటి


