‘భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ’ | - | Sakshi
Sakshi News home page

‘భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ’

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణ చేద్దామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇన్‌చార్జి వినాయకం, బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

భగీరథుని చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement