సోంపేట: పలాసలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన కిడ్నీ ఆస్పత్రి జిల్లాలోని కిడ్నీ రోగు లకు వరం వంటిదని ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ అన్నారు. పలాస కిడ్నీ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకుని ఇంటికి చేరుకున్న సోంపేటకు చెంది న హేమశ్రీని గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఆసుపత్రిలో ఉచి తంగా నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాకు ఎంతో చేశారని, రూ.700 కోట్లు వెచ్చించి ఇంటింటికి తాగునీరు అందజేసేందుకు శ్రీకారం చుట్టారని, డయాలసిస్ రోగులకు రూ.పది వేల పింఛను అందజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శిలగాన భాస్కరరా వు, ఎంపీటీసీ పొడుగు కామేష్, పార్టీ నాయకులు రేగు బాలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


