పొందూరు: కృష్ణాపురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కేశవదాసుపురం గ్రామానికి చెందిన పల్ల రాజ్‌కుమార్, లావేరు మండలం బుడుమూరుకు చెందిన పి.దుర్గాప్రసాద్‌లు లైటింగ్ పనులు చేస్తుంటారు. గురువారం బైక్‌పై పొందూరు వస్తుండగా కృష్ణాపురం వద్ద ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో యువకులు రోడ్డుపై తుళ్లిపడి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు స్పందించి 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు.


