శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్ఛాపురంలోని బాహుదా నదిపై వంతెన పనులు త్వరితగతిన ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన కార్యా లయం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. పురాతన వంతెన కావడంతో గతంలో కుప్పకూలిందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, ఇంతలో ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇచ్ఛాపురం, పరిసర గ్రామాలు, ఒడిశా గ్రామా ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నార ని చెప్పారు. ప్రధాన వంతెనగా గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.


