గార : శ్రీకూర్మంలో ఈ నెల 27న ఏకాదశి సందర్భంగా కూర్మనాథుని కల్యాణం జరగనున్న నేపథ్యంలో గురువారం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం చక్రఆళ్వార్ స్వామి ని ప్రత్యేక ఆసనంపై వేంచింపజేసిన అర్చకులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పరిషత్ రక్షాబంధన్, పతాక ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం గరుడ ధ్వజారోహణం, దేవతాహ్వానం జరిపారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, ప్రధానార్చకులు సీహెచ్. సీతారామ నృసింహాచార్యులు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పీయూ సీ విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని ట్రిపుల్ ఐటీ రిజి స్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై ఆరా తీశా రు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, సాగర్, సింహాచలం, యోగీశ్వ రీ తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, ప్రతి కేంద్రంలోనూ సౌకర్యాలను కల్పించి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అబ్జర్వ ర్ డాక్టర్ ఎం.ఎ.వి.రామకృష్ణ ఆదేశించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించి గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్ర తా ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల రవాణా, కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పాలిసెట్‌ను విజయవంతం చేయాలన్నారు.
ఎచ్చెర్ల : ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే వేతనదారులు పనివేళలు పాటించాలని డ్వామా పీడీ లవకుమార్ అన్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత కొలతల ప్రకారం పనిచేస్తే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో శోభాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.


