26న సంగీత విభావరి | - | Sakshi
Sakshi News home page

26న సంగీత విభావరి

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

26న సంగీత విభావరి సాయం అందించే వారేరీ?

శ్రీకాకుళం కల్చరల్‌: పర్లాకిమిడికి చెందిన చైతన్య మెలోడీస్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో ఈ నెల 26వ తేదీన 12 గంటల పాటు చైతన్య మెలోడీస్‌ సరిగమలు పేరిట సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సింహాద్రి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 45 మంది ఔత్సాహిక గాయనీ గాయకులు గీతాలు ఆలపిస్తార ని పేర్కొన్నారు. చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఒడిశా లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది శ్రీకాకుళం పరిసర ప్రాంత గాయనీ గాయకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాకారులు, కళాభిమానులు పాల్గొనాలని కోరారు.

టెక్కలి రూరల్‌ : టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లే వారికి సాయం అందించే వారు కరువయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగి నడవలేని స్థితిలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తే స్ట్రెచ్చర్‌ తెచ్చుకోవడం దగ్గర నుంచి డాక్టర్‌ వద్దకు వెళ్లడం వరకు మనమే చేసుకోవాలి. సహాయకుల జాడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గురువా రం ఓ యువతి తన కుటుంబ సభ్యుడికి కాలు విరిగిపోతే వైద్యుల వద్దకు తానే స్ట్రెచ్చర్‌ తీసుకెళ్లడం ఆస్పత్రిలో కనిపించింది.

షిరిడీసాయికి ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం కల్చరల్‌: బొందిలీపురంలోని దర్బార్‌ షిరిడీసాయి బాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంతోష్‌ బ్రహ్మ, సురేష్‌ బ్రహ్మ ఆధ్వర్యంలో స్వామివారికి మూడు హారతులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement