కారును ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టిన లారీ

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

కారును ఢీకొట్టిన లారీ ● పలువురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని కరజా డ వద్ద జాతీయ రహదారిపై గురువారం శ్రీకాకుళం నుంచి ఒడిశా వెళ్తున్న లారీ అదే రూటు లో నరసన్నపేట వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యా యి. ఒక్కసారిగా కారు అమాంతంగా పక్కకు రావడంతో ఇదే మార్గంలో వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. అది నేరుగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాకుళంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement