సంతబొమ్మాళి: సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ పరిపాలనలో కార్యాలయం పనితీరు, ప్రజలకు అందించే సేవలు, రికార్డులు, పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్నందున ఐఎస్‌ఓ –9001–2015 ధ్రువీకరణ పత్రాన్ని కేరళ పరిపాలన సంస్థ ప్రతినిధులు గురువారం అందజేశారు. జిల్లాలో అత్యుత్తమ గ్రీనరీ, ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న గ్రామ పంచాయతీగా గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన స్థానిక పరిపాలన వ్యవహారాల సంస్థ డైరెక్టర్ వి.పి.సుకుమార్, రాష్ట్ర పంచాయతీరా జ్ కార్యాలయం అధికారి ఇమాముద్దిన్ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాసరావు కు ఐఎస్‌వో–9001–2015 సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి అలివేలు మంగమ్మ, ఎంపీడీవో జయంత్‌ప్రసాద్, తహసీల్దార్ బి.హేమసుందరరావు, మండల స్వర్ణ గ్రామ అధికారి సీహెచ్.లక్ష్మణరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కూచెట్టి కాంతారావు, మాజీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి పాల్గొన్నారు.


