రైతును విస్మరిస్తే పుట్టగతులు ఉండవు | - | Sakshi
Sakshi News home page

రైతును విస్మరిస్తే పుట్టగతులు ఉండవు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

● ప్రారంభానికి నోచుకోని విత్తన శుద్ధికేంద్రం

● కేంద్రాన్ని సందర్శించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

నందిగాం: జిల్లాలో రైతులకు మేలు చేసే విత్తన శుద్ధి, నిల్వ కేంద్రాన్ని ప్రారంభించకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తాత్సారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ అన్నారు. బుధవారం మండలంలోని శివరాంపురం పంచాయతీ బడబంద గ్రామ పరిధిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన విత్తన శుద్ధి, నిల్వ కేంద్రాన్ని ఆయన పలువురు పార్టీ నాయకులు, రైతులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ హయాంలో జిల్లాలో విత్తన శుద్ధి కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో టెక్కలి డివిజన్‌ నందిగాం మండలం బడబందలో మరో విత్తన శుద్ధి, నిల్వ కేంద్రం ఐదు ఎకరాల్లో ఏర్పాటుకు రూ.10కోట్లు మంజూరు చేశారని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రూ.4.7 కోట్లతో భవనం నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశా రు. ప్రభుత్వ మారాక ఈ కేంద్రానికి పరికరాలు ఏర్పాటు చేయలేదని, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కేంద్రం ప్రారంభమైతే వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే అలా వదిలేశారని దుయ్యబట్టారు. 10వేల మెట్రిక్‌ టన్నుల విత్తనాల నిల్వ సామర్థ్యం, సుమా రు 5వేల హెక్టార్లకు విత్తనాలు సరఫరా చేసుకునే అవకాశం ఉన్నా ఈ కేంద్రాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత రైతులకు ఆఫ్‌ఫోర్‌ ప్రాజెక్టు మంజూరు చేస్తే, అది పూర్తి చేయడానికి రెండుసార్లు మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు ఎందుకు పూనుకోవడం లేదన్నా రు. నందిగాం మండలంలో మీరు చేసిన అభివృద్ధి, జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిపైన బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. విత్తన శుద్ధి కేంద్రాన్ని పరిశీలించడానికి వస్తుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, రైతుల బాగోగులు చూడకుండా సింగపూర్‌లో పర్యటిస్తున్నారని విమర్శించారు.

సందర్శనలో ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, యర్ర చక్రవర్తి, చిన్ని జోగారావు, పోలాకి మోహనరావు, తమిరె ఫాల్గుణరావు, జడ్యాడ జయరాం, కణితి నారాయణమూర్తి, అంబోడి విష్ణు, తమిరె రాజు, అన్నెపు రామారావు. ఎస్‌ హేమసుందరరాజు, నూక సత్యరాజు,ఎస్‌ వినోద్‌, శివారెడ్డి,భాను, సతీష్‌, కాళ్ల సంజీవరావు, కోత సతీష్‌, కిల్లి అజయ్‌,అక్కురాడ లోకనాధం, టెక్కలి విమల, కర్నిక జీవనరావు,తమిరె దేవేంద్ర, బొంగి హనుమంతురావు, దీర్ఘాశి కృష్ణారావు, పిన్నింటి జయరాం,నందదిగాం మహేష్‌,పినకాన తులసయ్య, కణితి కేశవరావు, ఉప్పాడ వెంకటరావు, అట్టాడ అప్పన్న, రేగల కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement