నరసన్నపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని స్థాయిల్లో రాణించాలన్నా, ఆత్మ స్థైర్యంగా ఉండాలన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్చించాలని ఆర్‌జేడీ విజయ భాస్కర్ అన్నారు. మండలం సత్యవరంలో బుధవారం ఆయన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వ పాఠశాలల పనితీరును వివరించి పాఠశాలల పటిష్టతకు సహకరించాలని కోరారు. అనంతరం స్కూల్ ఆవరణలో నరసన్నపేట మేజరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. జీతం కోసం కాకుండా మానవతా దృక్పథంతో ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు.
మాజీ సైనికుల సంక్షేమానికి ‘వీర్ పరివార్’ భరోసా
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమానికి, వారి న్యాయపరమై న సమస్యల పరిష్కారానికి ‘నల్సా వీర్ పరివా ర్ సహాయత యోజన–2025’ ఒక చక్కటి వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. బుధ వారం స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘లీగల్ సర్వీస్ క్లినిక్’ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.


