పాతపట్నం: పాతపట్నం రైల్వేస్టేషన్‌లో రాజారాణి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి దిగుతూ జారిపడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం రూర్కెలా నుంచి గుణుపూర్ వస్తున్న రాజారాణి ఎక్స్‌ప్రెస్ రైలు పాతపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగుతుండటంతో మెళియాపుట్టి మండలం సుందరాడ గ్రామానికి చెందిన సుమిత్ర పండి రైలు దిగుతుండగా కాలుజారి కింద పడింది. ఫ్లాట్‌పాం, రైలు మధ్య ఉండిపోవడంతో తలకు, ఎడమ చేయికు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు.


