సారవకోట: బైదాలాపురంలో సోమవారం రాత్రి యాళ్ల రాము ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 తులాల బంగారం పట్టుకుపోయారని బాధితులు బుధవారం సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడ్డపనస గ్రామానికి చెందిన పల్లి పావని కన్నవారి గ్రామమైన బైదాలాపురం సోమవారం వచ్చింది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తన పుస్తెలతాడును, ఇంట్లో చిన్న బాక్స్‌లో ఉన్న మరో పుస్తెలతాడును దొంగలు దోచుకుపోయారు. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బుధవారం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన కొత్త బ్యాచ్‌ను జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ బుధవారం ప్రారంభించారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. 40 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఫీజు ఇతర వివరాలకు 9390886033 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ ఏ.అమరసింహుడు, అకౌంట్స్ ఆఫీసర్ ఇ.జి.రాజు, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ పాల్గొన్నారు.


