విశ్రాంత సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

వజ్రపుకొత్తూరు: బెండిగేటు రైల్వే ట్రాక్‌ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్‌ రైలు కిందపడి నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన విశ్రాంత సీఆర్‌పీఎఫ్‌ జవాను బగాతి హిమంత్‌రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్‌పీ పోలీసుల కథనం మేరకు.. హిమంతరావు కొంతకాలంగా విశాఖపట్నంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై అనారోగ్యం పాలైన ఆయన ఇటీవల జడ్యాడకు వచ్చాడు. హెపటైటిస్‌ వ్యాధితో మానసికంగా బాధపడేవాడని, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు జీఆర్‌పీ పోలీసులకు తెలియజేశారు. జీఆర్‌పీ పోలీసులు బుధవారం శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రూడ్స్‌ రైలు లోకో పైలట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement