శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

న్యూస్‌రీల్‌

రోడ్డుపై రైతులు.. విదేశాల్లో అమాత్యులు

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

రోడ్డుపై మొక్కజొన్న

50 కిలోల గోమాంసం సీజ్‌

నరసన్నపేట: మేజర్‌ పంచాయతీ రాజీవ్‌ నగర్‌ కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా విక్రయిస్తున్న 50 కిలోల గోమాంసంను మంగళవారం పోలీసులు సీజ్‌ చేశారు. విశ్వ హిందూపరిషత్‌ సభ్యులు సుమ బాల, పొట్నూరు రమేష్‌లు స్థానిక పోలీసులకు సమాచారం అందజేయడంతో నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ విక్రయ కేంద్రాన్ని పరిశీలించి 50 కిలోల గో మాంసంను సీజ్‌ చేసి అమ్మకందారుడైన మహమ్మద్‌ ఖాశీంపై కేసు నమోదు చేశారు.

కనకమహాలక్ష్మికి బంగారు హారం బహూకరణ

డాబాగార్డెన్స్‌: ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరులతల్లి కనకమహాలక్ష్మికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంద శ్రీనివాసరావు బంగారు హారం బహూకరించారు. రూ.7,85,647 విలువ చేసే 61.49 గ్రాముల పొడులతో కూడిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు మంగళవారం అందజేశారు. వీరిచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, ప్రసాదం అందజేశారు.

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలని, నూతన పీఆర్‌సీ కమిటీ వేసి 30 శాతం ఇంటీరియర్‌ రిలీఫ్‌ మంజూరు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2005 డీఎస్సీ వారికి ఓపీఎస్‌ వర్తింపచేయాలని పీఆర్‌టీయూ నాయకు లు కోరారు. ఈ మేరకు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం శాంతియుత ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుల కు బకాయిలు చెల్లించాలని, 302 జీఓ పునరుద్ధరించి పదోన్నతు లు కల్పించాలని, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలను గ్రేడ్‌–1 హెచ్‌ఎంలుగా మార్చాలని, ఉర్దూ, ఒరియా ఉపాధ్యాయుల కు పదోన్నతులు కల్పించి బడులను బలోపేతం చేయాలని కోరారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

జిల్లాలో మొక్కజొన్న రైతులు రోడ్డున పడుతున్నారు. పంట కొనుగోలు చేయాలని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాలన అంశాలు తెలుసుకోవడానికి సింగపూర్‌ వెళ్లారు. ఇక్కడ రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే.. అక్కడ అమాత్యులు శిక్షణ తీసుకుంటున్నారు. ఓ వైపు పంటలను కొనుగోలు చేయడానికి డబ్బుల్లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మంత్రులను సింగపూర్‌ పంపించింది. ఈ వైఖరి అన్నదాతల ఆగ్రహానికి కారణమవుతోంది.

జిల్లాలో దయనీయ స్థితి..

ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించాక లాభాలు వస్తాయని రైతులు పంటలు వేసుకుంటా రు. వేసిన పంటకు సకాలంలో ఎరువులు అందించాలి. పంట పండాక కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పంట పండాక చేతులేత్తేసింది. కొనుగోలు చేయలేమంటూ దాట వేత ధోరణి ప్రదర్శిస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్‌, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో మొక్కజొన్న రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విత్తు దగ్గరి నుంచి పంట పండే వరకు కష్టాలు పడ్డారు. పంట చేతికొచ్చాక ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

దగా పడ్డ రైతులు

చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు దగా పడుతు న్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వేసిన పంటలన్నింటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విత్తనాల దగ్గరి నుంచి ఎరువుల వరకు, పంట పండించిన దగ్గరి నుంచి అమ్ముకునే వరకు కష్టాలు పడుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఎరువులన్నీ పచ్చనేతల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఎరువులన్నీ బ్లాక్‌ మార్కెట్‌ అయిపోయా యి. రూ.280 ఎరువును రూ.600కు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి రైతుకు దాపురించింది. దాదాపు అన్ని పంటలకు, అన్ని సీజన్‌లకు ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. ఎరువుల దందాను ఆపే పరిస్థితి లేకుండా పోయింది. కంచే చేను మేసినట్టు పరిస్థితి తయారైంది. నానా బాధలు పడి పంటను పండిస్తే ఇప్పుడా పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వ్యవసాయం దండ గ అని గతంలో చంద్రబాబు అన్న మాటలను ఇప్పుడు రుజువు చేసుకుంటున్నారని రైతులు అంటున్నారు.

కొనుగోలు కేంద్రాల ఊసే లేదు

బాధ్యత గల ప్రభుత్వమైతే రైతుకు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేసేందుకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. రైతు నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. దారుణమేంటంటే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జోలికే పోలేదు. పంటను కొనుగోలు చేయడానికి డబ్బుల్లేవంటూ చేతులేత్తేస్తోంది. ఇంతకంటే అసమర్థ ప్రభుత్వం ఇంకొకటి లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 87,821 ఎకరాల్లో మొక్క జొన్న సాగు జరిగింది. ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా మొక్కజొన్నకు రూ. 2400 దక్కాలి. కానీ కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ప్రకటనలు.. మాటలకే పరిమతమయ్యాయి.

రూ. 254కోట్లకు పైగా రైతుకు నష్టం

ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇదే

ఆసరాగా తీసుకుని పచ్చ నాయకులు దళారుల అవతారమెత్తారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తక్కువ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటా మొక్కజొన్నను రూ.1400 నుంచి రూ. 1600కు కొనుగోలు చేస్తున్నారు. లెక్కన క్వింటాకు రూ. 800 నుంచి రూ. 1000వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రూ.29వేల మేర కోల్పోతున్నా రు. జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ. 254కోట్లకు పైగా నష్టపోతున్నారు. జిల్లాకు చెందిన ఓ ఫౌల్ట్రీ యజమానిగా ఉన్న చౌదరి మొక్కజొన్న కొనుగోలు విషయంలో శాసిస్తున్నారు. తాను నిర్దేశించిన ధరకే దళారులు కొనుగోలు చేసేలా మాఫియా నడుపుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తే ఈ ధర కూడా దక్కదని పరోక్షంగా బెదిరిస్తున్నారు.

ప్రభుత్వంపై ఆగ్రహం

అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు ఖరీఫ్‌లోనూ, ఇటు రబీలో నూ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఆరుబయట పండిన పంటను ఎండబెట్టుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కానీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు చోద్యం చూస్తున్నారు.

ప్రజా సంతృప్తిలో

రాష్ట్ర సగటును దాటాలి: కలెక్టర్‌

తీవ్ర ఆందోళనలో మొక్కజొన్న రైతులు

సింగపూర్‌లో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

మద్దతు ధర దక్కక దిగాలు పడుతున్న అన్నదాతలు

దళారులుగా అవతారమెత్తిన అధికార పార్టీ నాయకులు

కొనుగోళ్లను శాసిస్తున్న ఓ ఫౌల్ట్రీ యజమాని చౌదరి

జిల్లాలో రూ. 254కోట్లకు పైగా నష్టపోతున్న రైతులు

నాడు నేడు ఎంత తేడా

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఎరువులు కూడా సకాలంలో రైతు ఇంటికే అందజేసింది. పండిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన మొక్కజొన్నను రవాణా చేసేందుకు నేరుగా రైతుల పొలాలకు లారీలు, కార్గో బస్సులు పంపించేది. అవి చాలకపోతే సీట్లు తీసి పల్లె వెలుగు బస్సులు ఉపయోగించేది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దళారులకు తావివ్వకుండా నేరుగా రైతు పొలం వద్దకు వెళ్లి కొనుగోలు చేసేది. అంతటితో ఆగకుండా 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు వేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాల్లేవు. మద్దతు ధరకు కొనుగోలు చేసే నాథుడు లేడు. రైతును నట్టేట ముంచేశారు. చేతిలో ఉన్న పంటను అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement