టెక్కలి: వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు టెక్కలి పోలీసులు మంగళవారం రాత్రి నోటీసులు అందజేశారు. ఈ మేరకు ఎస్‌ఐ కె.రాము నేరుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వెళ్లి తిలక్‌కు నోటీసులు అందజేశారు. ఈ నెల 10వ తేదీన నమోదైన కేసుకు సంబంధించి స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశంపై రెండుమార్లు తిలక్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తిలక్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతి అక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నందుకు, కక్షపూరితంగా అక్రమ కేసులు నమో దు చేస్తున్నారని తెలిపారు. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు. సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై కావాలనే కొంత మంది టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమంగా విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని వేధిస్తున్నారని తెలిపారు.


