● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం కూడా వైఎస్సార్ సీపీకి 50 శాతం ఓట్లు వస్తాయని చెబుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదపాడులోని ధర్మాన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు, వా ర్డు మెంబర్ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన రాజకీయ జీవితం సర్పంచ్ నుంచే మొదలైందన్నా రు. పౌరులకు అన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థ పెడితే దాన్ని నిర్వీర్యం చే సేశారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం టీడీపీకి మాత్రమే తెలుసని అన్నారు. తు ఫాన్లకు నేలపాలైన పంటను సర్కారు గాలికి వదిలేసిందన్నారు. కొందరు అధికారులు పచ్చ నేతలకు కొమ్ము కాస్తున్నారని, వారి చిట్టా తమ వద్ద ఉందని తెలిపారు.


