● వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం
● అత్యవసర కాల్స్‌పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● కొత్తగా సోంపేట, నరసన్నపేటలకు రెండు శకటాలు
● ‘సాక్షి’తో ముచ్చటించిన జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు
శ్రీకాకుళం క్రైమ్ : సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతగా ఉండాలని, సిబ్బంది సైతం ఫైర్ ఎమెర్జన్సీ కాల్స్‌పై అలెర్ట్‌గా ఉండాలని జిల్లా అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ అధికారి జడ్డు మోహనరావు అన్నారు. జిల్లాలో అగ్నిమాపక శకటాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు.
కొత్తగా రెండు శకటాలు..
ఇదివరకు శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలం ఫైర్‌స్టేషన్లకు శాశ్వత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం సోంపేట స్టేషన్ శాశ్వత భవనంలోకి మారడానికి సిద్ధంగా ఉంది. నరసన్నపేటకు సెమీ పెర్మినెంట్ భవనమే ఉంది. సోంపేట, నరసన్నపేటలకు వారం రోజుల కిందటే ఎలక్ట్రానిక్ బేస్ మీద నడిచే రెండు అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్ ఇంజిన్లు వచ్చాయని మోహనరావు తెలిపారు. 10 ఫైర్ స్టేషన్లలో 45 మంది ఫైర్‌మ్యాన్‌లు, 23 మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, 33 మంది లీడింగ్ ఫైర్‌మ్యాన్‌లు, ఎనిమిది మంది స్టేషన్ అధికారులున్నారు. అయితే ఇంకా 68 మంది వరకు సిబ్బంది అవసరం ఉంది.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
● అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు 101కు గానీ, సంబంధిత స్టేషన్ ఫోన్ నంబర్‌కు గానీ, స్టేషన్ అధికారికి గానీ తక్షణం కాల్ చేయాలి.
● కాల్స్ వచ్చిన తక్షణమే ఇన్‌చార్జి ఫైర్ స్టేషన్ అధికారులు సిబ్బందిని అలర్ట్ చేయాలి.
● రోడ్డు మీదకు వచ్చేసరికి కచ్చితంగా కండిషన్‌లో ఉన్న వాహనాలు, పరికరాలే ఉండాలి. ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉన్నవీ లేనిదీ తనిఖీ చేసుకోవాలి.
● వేసవి ముగిసేంతవరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయరు.
● ఎలాంటి ఫైర్‌కాల్ వచ్చినా సంబంధిత స్టేషన్ అధికారికి సమాచారం ఇవ్వాలి. నిర్లక్ష్యంతో అధికారి వినకపోయినా, సిబ్బంది చెప్పకపోయినా, ఘటనాస్థలికి వెళ్లకపోయినా ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సిందే.
● తక్షణ చర్యల్లో భాగంగా పరికరాలతో కూడిన మిస్ట్ బుల్లెట్ అందుబాటులో ఉంచుకోవాలి.
● 101 ఎమర్జెన్సీ నంబర్, స్టేషన్ ఎస్టీడీ నంబర్‌తో పాటు ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేలా స్టేషన్ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉన్నాం. వారోత్సవాల్లో భాగంగా ఇప్పటికే ప్రజలను అవగాహనపరుస్తున్నాం. గత రెండేళ్లలో దాదాపు రూ. 15 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవిస్తే.. రూ. 42 కోట్లకు పైగా ఆస్తులను ప్రమాదాల్లో కాపాడగలిగాం. పబ్లిక్‌లో కూడా అవేర్‌నెస్ వచ్చింది. మా శకటాలు వెళ్లే లోపే వాళ్లూ రెస్పాన్స్ అవుతున్నారు. నిబంధనలు పాటించని, ఫైర్‌సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేని, అనుమతులు లేని మాల్స్, పరిశ్రమలేవైనా మా దృష్టిలోకొస్తే చర్యలు తప్పవు. – జడ్డు మోహనరావు,
జిల్లా అగ్నిమాపక అధికారి, శ్రీకాకుళం
మొబైల్ ఫోన్ నంబర్లు ఉన్న సిమ్‌లు యాక్టివేట్ చేసుకోవాలి.
● గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధి ముఖ్య కూడళ్లలోను, హోటళ్లు, సచివాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, హెల్త్ సెంటర్లు, ఎఫ్‌పీఎస్ డీలర్ షాపులు, రైతుబజారు, మార్కెట్లలో స్కూళ్లు, పోస్టు ఆఫీస్‌లు, బ్యాంకులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లులో సంబంధిత ఫైర్‌స్టేషన్ అధికారి మొబైల్ నెంబర్, స్టేషన్ నంబర్, ఎమెర్జెన్సీ కాల్ 101 నెంబర్లు కనిపించేలా ప్రదర్శించాలి.
జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు : 12
2024–25 లో జిల్లావ్యాప్తంగా ఫైర్‌కాల్స్ : 628
ఆస్తినష్టం : రూ. 10,57,69,000
కాపాడిన ఆస్తి : రూ. 25,52,50,000
2025–26లో జిల్లావ్యాప్తంగా ఫైర్‌కాల్స్ : 516
ఆస్తినష్టం : రూ. 4,45,57,000
కాపాడిన ఆస్తి : రూ. 16,84,65,000
అత్యవసర నంబర్లు
స్టేషన్ కాంటాక్ట్ మొబైల్ ఆఫీస్ నంబర్
శ్రీకాకుళం 9963726782 08942222099
ఇచ్ఛాపురం 8317587461 08947231101
సోంపేట 9963744295 08947234101
పలాస 9963730662 08945241101
టెక్కలి 9000505945 08945244277
కోటబొమ్మాళి 9963730845 08942238659
నరసన్నపేట 7680089447 08942276777
ఆమదాలవలస 9963730658 08942286401
కొత్తూరు 9000873349 08946258444
రణస్థలం 9963731326 08942293101
ఔట్‌పోస్ట్ ఫైర్ స్టేషన్ ఆఫీస్ నెంబర్
మందస 08947237101
పొందూరు 08941242101
ఫైర్ ఎమెర్జన్సీ కాల్ 101


